Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి ఏర్పాట్ల కోసం లక్షలు ఖర్చు చేశాక.. వరుడి ముక్కు బాగోలేదని చెప్పిన అమ్మాయి

  • కర్ణాటకలో ఘటన
  • ఆన్‌లైన్‌లో చాటింగ్ ద్వారా అబ్బాయితో పరిచయం
  • పెళ్లికి ఒప్పుకున్న ఇరు కుటుంబ సభ్యులు
  • ఈ నెల 30న ముహూర్తం
పెళ్లి ఏర్పాట్ల కోసం లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు పూర్తి చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాల వారు పెళ్లి దుస్తులు షాపింగ్ చేస్తూ హడావుడిగా ఉన్నారు. ఇంతలో వరుడి ముక్కు బాగోలేదని, తనకు ఆ ముక్కు నచ్చట్లేదని చెప్పింది పెళ్లి కూతురు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కోరమంగలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్యోతిప్రకాశ్‌కు ఓ మాట్రిమోనీ సైట్‌ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయమైంది.

వారిద్దరు చాటింగ్‌ చేసుకున్నారు. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించారు. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 30న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఏర్పాట్లకు లక్షలు ఖర్చు చేశారు. అయితే, పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని తనకు అతడి ముక్కు నచ్చట్లేదని పెళ్లి కూతురు చెప్పింది. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలని, లేదంటే పెళ్లికి ఒప్పుకోనని చెప్పింది. దీంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Karnataka

More Telugu News